వైసీపీ ప్రభుత్వ తొలి బడ్జెట్ ఎన్ని లక్షల కోట్లంటే...

వైసీపీ ప్రభుత్వ తొలి బడ్జెట్ ఎన్ని లక్షల కోట్లంటే...

ఆంధ్రప్రదేశ్ 2019-20 బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 2 లక్షల 27 వేల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో ముఖ్యంగా వ్యవసాయానికి రూ. 28,886 కోట్లు కేటాయించారు.

*వైఎస్సార్‌ రైతు భరోసాకు రూ. 8,750 కోట్లు

*వైఎస్సార్‌ వడ్డీ లేని రుణాలు రూ.100 కోట్లు

*పంటల బీమాకు రూ. 1,163 కోట్లు

*పశువుల బీమా రూ.50 కోట్లు

*ధరల స్థిరీకరణ నిధి రూ. 3వేల కోట్లు

*ఉచిత బోరుబావులకు రూ.200 కోట్లు

*శీతల గిడ్డంగులకు రూ.200 కోట్లు

*ప్రకృతి వైపరీత్యాల నిధికి రూ.2000 కోట్లు

*పాడి రైతుల సంక్షేమానికి రూ.100 కోట్లు

*మత్సకారులకు సహాయం 4 వేల నుంచి 10 వేలకు పెంపు.. రూ.200 కోట్లు

*రైతు ఆత్మహత్య , ప్రమాద మరణాల కుటుంబాలకు ఆర్ధిక సాయం రూ 7 లక్షలు

*అమ్మఒడి పథకానికి రూ.6,455 కోట్లు

Tags

Read MoreRead Less
Next Story