నా మొదటి పోస్టు నీకే.. ఐ లవ్యూ: రాం చరణ్

నా మొదటి పోస్టు నీకే.. ఐ లవ్యూ: రాం చరణ్
X

ఢిల్లీకి రాజైనా అమ్మకి కొడుకే అన్న మాటలు అక్షరాలా నిజం. కొడుకు ఎంత ఎత్తుకు ఎదిగినా అమ్మ ప్రేమ ముందు చిన్న వాడే. తన కంటే ఎంతో ఎత్తుకు ఎదిగిన కొడుకుని చూసి తండ్రి ఎంత గర్విస్తాడో.. అమ్మ కూడా అంతకంటే ఎక్కువ ఆనందాన్ని పొందుతుంది. మెగా స్టార్ తనయుడు రాంచరణ్ రెండ్రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచాడు. అందులో ఫస్ట్ పోస్ట్ అమ్మకే అంకితం అంటూ తను చిన్నప్పుడు అమ్మఒడిలో కూర్చుని ఉన్న ఫొటోని పోస్ట్ చేశాడు. కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు.. బిడ్డపై తల్లికి ఉన్న ప్రేమలాగా.. నా మొదటి పోస్టు నీకే అంకితం చేస్తున్నానమ్మా.. ఐ లవ్యూ అని పెడుతూ అప్పటి ఫోటోతో పాటు, ప్రస్తుత ఫోటోను షేర్ చేశాడు చరణ్. ఫోటోని చూసి చరణ్ అభిమానులతో పాటు మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా, చరణ్ 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తూ బిజీగా ఉంటూనే.. మరో పక్క తండ్రి చిత్రం 'సైరా'కి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

View this post on Instagram

Somethings never change !! Dedicating my first post to u. Love u Amma. ❤#mamasboy #forever.

A post shared by Ram Charan (@alwaysramcharan) on

Next Story

RELATED STORIES