Top

మేము తలుచుకుంటే మీరు అక్కడ కూర్చోలేరు : వైసీపీ

మేము తలుచుకుంటే మీరు అక్కడ కూర్చోలేరు : వైసీపీ
X

సున్నా వడ్డీ రుణాలపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్షాల మధ్య అగ్గిరాజుకుంది. విమర్శలు, ప్రతివిమర్శలతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు తలెత్తాయి..తన ప్రసంగానికి అడ్డుతగిలిన టీడీపీ నేతలపై జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు... మేం 150 మందిమి ఉన్నామని...తాము తల్చుకుంటే .. టీడీపీ సభ్యులు వాళ్ల స్థానాల్లో కూడా కూర్చోలేరని హెచ్చరించారు..

జగన్ వ్యాఖ్యలపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం తలెత్తింది...ఆ తర్వాత మరోసారి మాట్లాడిన సీఎం జగన్..సభలోకి రౌడీలూ, గుండాలను తీసుకోస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. జగన్ మాట్లాడుతున్న తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు..పదే పదే హెచ్చరించే ధోరణిలో సీఎం మాట్లాడుతున్నారని అన్నారు. మా వాయిస్ కూడా వినిపించే అవకాశాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Next Story

RELATED STORIES