ఎంత కష్టమొచ్చింది !.. 65 కోట్ల రూపాయిలతో..

ఎంత కష్టమొచ్చింది !.. 65 కోట్ల రూపాయిలతో..

నీటి సంక్షోభం నుంచి చెన్నై బయటపడలేదు. మూడు నెలలుగా తీవ్ర ఎద్దడిని ఎదుర్కొంటోంది. చెన్నై దాహార్తి తీర్చేందుకు పొరుగున ఉన్న కేరళ.. ముందుకు వచ్చింది. రెండున్నర మిలియన్‌ లీటర్ల నీటిని ప్రత్యేక రైలు ద్వారా తరలించింది.

మూడు నెలలుగా తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న చెన్నై...... ఆ నీటి సంక్షోభం నుంచి ఇప్పటికి బయటపడలేదు. తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకడం లేదు. దీంతో చెన్నైవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి దాహార్తితో తీర్చేందుకు పొరుగున ఉన్న కేరళ స్పందించింది. రైలు వ్యాగన్ల ద్వారా నీటిని పంపింది. వేలూరు జిల్లా జోలర్‌ పేట నుంచి చెన్నైకి నీటిని తరలించారు. రెండున్నర మిలియన్ల లీటర్ల నీటిని 50 నీటి ట్యాంకర్‌ వ్యాగన్ల ద్వారా పంపారు.

జోలార్‌పేట్‌ రైల్వే స్టేషన్‌ నుంచి జెండా ఊపి రైలుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు.అయితే ఈ ప్రత్యేక రైలు కనెక్టింగ్‌ వాల్వ్‌ సమస్యల కారణంగా ఒక రోజు ఆలస్యమైంది. 50 నీటి ట్యాంకర్‌ వ్యాగన్ల రాకతో చెన్నై వాసుల నీటి కష్టాలు కొంతైనా తీరుతుంది. నీటిని సరఫరా చేసే సమయంలో... తొక్కిలాట జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఒక్కో ట్రిప్పుకు ఏడున్నర లక్షల రూపాయలు దక్షిణ మధ్య రైల్వేకు చెల్లిస్తోంది చెన్నై మెట్రో. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 65 కోట్ల రూపాయలు విడుదల చేసింది. చెన్నై నీటి కష్టాలు తీర్చడానికి రోజు 10 మిలియన్‌ లీటర్ల నీరు అవసరం. రైళ్ల ద్వారా నీటిని సరఫరా చేసినప్పటికి సగం మందికి మాత్రమే దాహార్తీ తీరుతుంది. గత కొన్ని నెలలుగా చెన్నైలో నీటి కష్టాలు తీవ్రంగా ఉండటంతో స్కూళ్లకు సెలవు ఇచ్చారు. చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసుకోవాలన్నాయి. ఓ మోస్తరు నుంచి పెద్ద పెద్ద హోటళ్లన్నీ నీటి కోటా విధించాయి. మరికొన్ని హోటళ్లు నీటి కొరతతో మూతపడ్డాయి.

Tags

Read MoreRead Less
Next Story