Top

టీడీపీ, వైసీపీ మధ్య ఫ్లెక్సీ చిచ్చు

టీడీపీ, వైసీపీ మధ్య ఫ్లెక్సీ చిచ్చు
X

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో టీడీపీ, వైసీపీ మధ్య ఫ్లెక్సీ చిచ్చు చెలరేగింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి జన్మదినోత్సవానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించింది. కర్రెల వంతెన సెంటర్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీతో పాటు ఫైర్ స్టేషన్ సెంటర్లోని భారీ హెల్డింగ్ ను కూడా తొలగించారు. దీంతో మున్సిపల్ సిబ్బందిపై టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఫ్లెక్సీల తొలగింపును నిరసిస్తూ మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆందోళన నిర్వహించారు.

ఏలూరులో గతంలోనూ ఫ్లెక్సీల రాజీకయంపై దుమారం చెలరేగింది. గతంలో నగర మేయర్ నూర్జహాన్, పెదబాబు వైసీపీ చేరిన సమయంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే.. మున్సిపల్ సిబ్బంది ఫ్లెక్సీలను తొలగించారు. ఇప్పుడు బడేటి ఫ్లెక్సీల తొలగింపు ప్రతీకారామే అనే వాదన వినిపిస్తోంది.

Next Story

RELATED STORIES