ఇకపై విమానం ఎక్కాలంటే అంత వీజీ కాదండోయ్.. రూల్స్ మారాయ్..

ఇకపై విమానం ఎక్కాలంటే అంత వీజీ కాదండోయ్.. రూల్స్ మారాయ్..
X

నిజానికి విమానం ఎక్కడం ఎప్పుడూ అంత ఈజీ కాదు. ఇదుంటే అది ఉందా.. అది ఉంటే ఇది లేదేంటి అంటూ ఎన్ని ఫ్రూఫ్‌లు తీసుకెళ్లినా ఏదో ఒకటి అడిగి సతాయిస్తుంటారు. సరే మొత్తానికి వీసా, పాస్‌పోర్టు లాంటివి వచ్చాయి కదా అనుకుంటే మూడు గంటలు ముందే వెళ్లి ఎయిర్‌పోర్ట్‌లో కూర్చోవాలి. ఆ చెకింగులు.. ఈ చెకింగులు అంటూ ఓ గంట. మొత్తానికి విమాన ప్రయాణం ఒక్కసారి చేస్తే మోజు కాస్తా తీరిపోతుంది. అయినా కొన్ని సందర్భాల్లో తప్పదు. ఇక బిజినెస్ చేసే వాళ్లైతే పనుల మీద అప్ అండ్ డౌన్ ఫ్టైట్ జర్నీ చేస్తుంటారు. సరే.. అదంతా ఒక ఎత్తైతే ఉన్నరూల్స్‌కి మరికొన్నింటిని జత చేసింది విమానయాన సంస్థ. వీటన్నింటిని కచ్చితంగా పాటించకపోతే మీ విమాన ప్రయాణం క్యాన్సిల్ అంటోంది. మరి ఆ రూల్స్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం.

ప్రయాణికుడి దగ్గర నుంచి మద్యం వాసన కాని, మత్తు పదార్ధాల సేవనం కానీ చేసాడని తెలిసిందో మీ ఫ్లైట్ జర్నీ క్యాన్సిల్ చేసే హక్కు విమాన సిబ్బందికి ఉంటుంది.

చెప్పుల్లేకుండా విమానం ఎక్కుతానంటే కుదరదు. అప్పుడు కూడా సిబ్బంది అడ్డుకుంటారు.

లేటెస్ట్ ఫ్యాషన్ అంటూ పిచ్చి పిచ్చి దుస్తులు వేసుకుంటే అనుమతించరు. తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించే రీతిలో మీ వస్త్రధారణ వుంటే ఓ సారి చెక్ చేసుకోమంటోంది.

ఇక నెలలు నిండిన గర్భిణులు డెలివరీ అవడానికి అమ్మగారింటికో, అమ్మమ్మ గారింటికో వెళతామంటే కుదరదు. 72 గంటల్లోగా ప్రసవించే అవకాశం లేదని డాక్టర్లు సర్టిఫికెట్ ఇస్తే తప్పించి ఆమెని ఫైట్ ఎక్కించుకోరు.

ఫ్టైట్ ఎక్కింతరువాత ఫోన్లు మాట్లాడ కూడదు, ధూమపానం చేయకూడదు.

ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితి బాలేకపోతే కూడా ఫ్లైట్ ఎక్కనివ్వరు.

ఇంతకు ముందెప్పుడైనా హీరోలా ఫోజు కొట్టి విమాన సిబ్బంది మీద చేయి చేసుకున్న దాఖలాలేమైనా ఉంటే ఆ చిట్టా బయటకు తీసి అటువంటి వారిని కూడా అనుమతించరు.

పైవేవి లేవనుకుంటే హ్యాపీగా విమానం ఎక్కేయొచ్చు.

Next Story

RELATED STORIES