Top

తిరుమలలో ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3 బ్రేక్‌ దర్శనాలు రద్దు : వైవీ సుబ్బారెడ్డి

తిరుమలలో ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3 బ్రేక్‌ దర్శనాలు రద్దు : వైవీ సుబ్బారెడ్డి
X

తిరుమలలో ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3 బ్రేక్‌ దర్శనాలను త్వరలోనే రద్దు చేస్తామన్నారు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. విఐపీలు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దర్శనానికి రావాలని ఆయన సూచించారు. వీఐపీలు పదేపదే దర్శనాలకు వస్తే.. సామాన్య భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నారు. పది రోజుల్లో పాలకమండలి సభ్యులను సీఎం నియమిస్తారన్నారు. శ్రీవారి సేవకు వచ్చి దురదృష్టవశాత్తూ చనిపోతే టీటీడీ తరపున ఆర్థిక సహాయం ఇవ్వాలన్నదానిపై చర్చిస్తున్నామన్నారు. తిరుపతిలోని బర్డ్స్‌ ఆస్పత్రిని దేశంలోనే నెంబర్‌ వన్‌ ఆసుపత్రిగా నిలుపుతామన్నారు.. బర్డ్స్‌లో వైద్య సేవల పనితీరు తెలుసుకునేందుకు ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డితో కలిసి.. ఆకస్మిక తనిఖీలు చేశారు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.

Next Story

RELATED STORIES