తాజా వార్తలు

నిజామాబాద్‌ రైతు వినూత్న ఆలోచన

నిజామాబాద్‌ రైతు వినూత్న ఆలోచన
X

నిజామాబాద్‌ జిల్లా రైతు భాస్కర్‌ రెడ్డి వినూత్న ఆలోచన అందర్నీ ఆకట్టుకుంటోంది. కేవలం 20 వేల ఖర్చుతో ట్రాక్టర్‌ ట్రాలీని పోలిన వాహనాన్ని తయారు చేశాడు. మినీ ట్రాలీని రూపొందించి దాన్ని తన బైక్‌కు అమర్చాడు. అందులో పంట పొలాలకు వ్యవసాయ కూలీలను, ఎరువులు, విత్తనాలను సులభంగా తరలిస్తున్నాడు.

ట్రాక్టర్‌ కొనే ఆర్థిక సామర్థ్యం లేని తన లాంటి సన్నకారు రైతులకు ఇది ఎంతో ఉపయోగపడుతోంది అంటున్నాడు భాస్కర్‌ రెడ్డి. ట్రాక్టర్‌ లేని లోటు ఈ ట్రాలీ తీరుస్తోందన్నాడు. ఈ మినీ ట్రాలీని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. భాస్కర్‌ రెడ్డి వినూత్న ఆలోచన మిగితా రైతులకు స్ఫూర్తినిస్తోందంటున్నారు. అందరూ ఇకపై ఇలాంటి వాహనాలే వాడుతామంటున్నారు..

Next Story

RELATED STORIES