రాష్ట్రపతి దంపతులకు వేదపండితుల ఆశీర్వచనాలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్. ఆలయ సంప్రదాయాల ప్రకారం రాష్ట్రపతికి ఇస్తికఫాల్ స్వాగతం పలికిన టీటీడీ అధికారులు.. స్వామివారి దర్శనాన్ని దగ్గరుండి జరిపించారు. శ్రీవారి సేవలో పాల్గొన్న రాష్ట్రపతి దంపతులకు రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు టీటీడీ అధికారులు.
రాష్ట్రపతి దంపతులతో పాటు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకు ముందు రాష్ట్రపతి కోవింద్.. శ్రీవరాహ స్వామివారి సేవలో పాల్గొన్నారు.
ఈ మధ్యాహ్నం 3 గంటల సమయంలో రామ్ నాథ్ కోవింద్ తిరుపతి విమానాశ్రయంకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో శ్రీహరికోటకు బయల్దేరుతారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో షార్ లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. అర్ధరాత్రి తర్వాత జరగనున్న చంద్రయాన్ -2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. అనంతరం తిరిగి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి ప్రయాణమవుతారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com