తాజా వార్తలు

తెలంగాణలో అమల్లోకి రాబోతోన్న కొత్త మున్సిప‌ల్ చట్టం

తెలంగాణలో అమల్లోకి రాబోతోన్న కొత్త మున్సిప‌ల్ చట్టం
X

తెలంగాణలో కొత్త మున్సిప‌ల్ చట్టం అమల్లోకి రాబోతోంది. ప్ర‌త్యేక అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి.. బిల్లుకు చట్టరూపం తీసుకురానుంది ప్రభుత్వం. దీని ప్రభావంతో మున్సిప‌ల్ ఎన్నిక‌లు ఆల‌స్యం కానున్నాయి. నిజానికి.. సోమ‌వార‌మే ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కావాల్సి ఉంది. ఓటర్ల జాబితాల ఆల‌స్యం.. కొత్త చ‌ట్టంపై ప్ర‌భుత్వం బిజీగా ఉండడంతో.. ప్రక్రియ వారం ఆల‌స్యం కానుంది.

మున్సిపోల్స్‌ కోసం ఓటర్ల తుది జాబితాను ఇప్పటికే ప్రచురించాల్సి ఉంది. వివిధ మున్సిపాల్టీల నుంచి ఓట్ల చేర్పులపై ఫిర్యాదులు అంద‌డం.. పేర్ల గల్లంతు వంటి అంశాల‌తో గడువును మంగళవారానికి పొడిగించారు. కమిషన్‌ మాత్రం 3 కార్పొరేషన్లు, 129 మున్సిపాల్టీల ఓటర్ల తుది జాబితాను రెడీ చేసింది. అఖిల‌ప‌క్ష స‌మావేశంలో వ‌చ్చిన అభ్యంత‌రాల‌ను పరిగణలోకి తీసుకోనున్నారు. ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టానికి అమోదం తెల‌పనున్న నేపథ్యంలో ప్రక్రియ వాయిదా వేయాల్సి వ‌చ్చింద‌ని అధికారులు తెలిపారు.

ఈ స‌మ‌యంలో లోటుపాట్లను సవరించుకోవాలని అధికారులు నిర్ణయించారు. వార్డుల పున‌ర్విభ‌జ‌నపై కొందరు కోర్టులను అశ్ర‌యించిన నేపథ్యంలో.. అక్కడి పరిస్థితులపైనా దృష్టి పెట్టనున్నారు. పొర‌పాట్ల‌ను చ‌క్క‌దిద్దుకుని.. విమ‌ర్శ‌ల‌కు ఆస్కారం లేకుండా చూసుకునేందుకు ఈ స‌మ‌యం క‌ల‌సి వ‌చ్చింద‌ని అధికారుల అభిప్రాయం.

మరోవైపు.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల అంశం కూడా పరిశీలనలో ఉందని అధికారులు చెప్తున్నారు. అయితే.. రిజర్వేషన్ల ఖరారులో కొంత ఆలస్యం జరుగుతున్నట్టు సమాచారం. కారణాలు ఏవైనా.., స‌మ‌యం ఎప్పుడైనా.., మున్సిపోల్స్‌ నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు పూర్తి చేసుకుని సిద్దంగా ఉన్న‌ట్లు స్పష్టంచేశారు.

Next Story

RELATED STORIES