మీ సాయం నాకొద్దంటూ ఆనంద్ మహీంద్రాకే షాకిచ్చిన లెక్కల మాస్టారు

మీ సాయం నాకొద్దంటూ ఆనంద్ మహీంద్రాకే షాకిచ్చిన లెక్కల మాస్టారు
X

గొప్ప వ్యక్తులు కావాలంటే బిలియనీరో, ట్రియలీనీరో.. లేదంటే ఓ పేద్ద కంపెనీకో అధినేత కావలసిన అవసరం లేదు. తనకి వచ్చిన విద్యని పదిమందికీ అందిస్తూ సంఘంలో వారిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దితే.. స్వయం శక్తితో పైకి వచ్చి పదిమందికీ స్ఫూర్తినిస్తే.. ఆయన సక్సెస్ స్టోరీని సినిమాగా తీస్తుంటే అంతకంటే ఆనందం ఏం వుంటుంది. అలాంటి వ్యక్తికి ఆనంద్ మహీంద్రా లాంటి వ్యక్తి సాయం చేస్తానంటే సున్నితంగా తిరస్కరించారు. ఇదే విషయన్ని ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. మాష్టారుగా సూపర్ 30 ఇనిస్టిట్యూట్‌ని పెట్టి విద్యార్థులకు గణితం బోధిస్తున్నారు ఆనంద్ కుమార్. బ్యాచ్‌కి 30 మంది నిరుపేద విద్యార్థులను తీసుకుని వారికి ఐఐటీ కోచింగ్‌లో ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు.. ఆయన ఎంతకష్టపడి పైకొచ్చింది వంటి విషయాలన్నీ సూపర్ 30 బయోపిక్‌‌లో చూపించారు. బాలీవుడ్‌లో రిలీజైన సూపర్ 30 విడుదలై కలెక్షన్లతో దూసుకెళుతున్న ఈ చిత్రంలో ఆనంద్ కుమార్ పాత్రను బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పోషించారు. ఆయన గురించి తెలుసుకున్న మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్వయంగా వెళ్లి సాయం అందిస్తానని అడిగారు. అందుకు ఆనంద్ కుమార్ తిరస్కరించారు. సొంతంగానే సూపర్ 30 కార్యక్రమాన్ని కొనసాగిస్తానని చెప్పారు. ఆనంద్ కుమార్ కృషిని తాను అభినందిస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను చూసిన ఆనంద్ కుమార్.. థ్యాంక్యూ సర్.. మీ అభినందనలు నాకెంతో బలాన్ని ఇస్తాయి అని రిప్లై ఇచ్చారు.

Next Story

RELATED STORIES