హాయ్.. నేనెవరో చెప్పుకోండి చూద్దాం: అందాల తార

హాయ్.. నేనెవరో చెప్పుకోండి చూద్దాం: అందాల తార
X

అసలే నేనెంతో అందంగా ఉంటాను. కొంచెం మేకప్ వేస్తే మరింత అందంగా అనిపిస్తాను. అది ఎప్పుడూ రొటీన్‌గా ఉండేదే. ఓ సారి డిఫరెంట్‌గా ట్రై చేస్తే మీరు నన్నెలా రిసీవ్ చేసుకుంటారో చూద్దామని.. చిలిపిగా చేయాలనిపించింది. ఇంతకీ నేనెవరో గుర్తుపట్టారా.. అదేనండి.. తెలుగు ప్రేక్షకులకి నేను సుపరిచితమే.. హార్ట్ ఎటాక్, సన్ ఆఫ్ సత్యమూర్తి, క్షణం వంటి చిత్రాల్లో నటించాను. ఈ మధ్య రీసెంట్‌గా రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం కల్కి‌లో మెయిన్ హీరోయిన్‌గా కనిపించాను అంటోంది. ఎత్తుపళ్లు, పొట్ట వేసుకుని పిజ్జా తింటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. సినిమాల్లో తక్కువగా కనిపించినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ఏదో ఒకటి చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అందాలు ఆరబోసే ఆదాశర్మ ఇప్పుడిలా అందవిహీనంగా తయారై పోస్టులు పెట్టేసరికి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి పిజ్జా ముఖం నీకు తప్ప ఎవరికీ లేదు అని కామెంట్లు పెడుతున్నారు. అమ్మడి ఫ్యూచర్ లుక్ ఇదేనంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆదా బాలీవుడ్ చిత్రం మాన్ టు మాన్‌లో నటిస్తోంది. మగాడిగా పుట్టిన ఒక వ్యక్తి లింగమార్పిడి చికిత్స ద్వారా స్త్రీగా మారి, మరొక మగాడిని ప్రేమించి, పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగింది అనేది రొమాంటిక్ కామెడీ స్క్రీన్ ప్లేతో చూపించబోతున్నారు. ఈ చిత్రాన్ని అబిర్ సేన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు.

Next Story

RELATED STORIES