పాత కోర్సులకు చెల్లుచీటి.. ఇక పై ఉపాధినిచ్చే కొత్త కోర్సులే: కేంద్రం

పాత కోర్సులకు చెల్లుచీటి.. ఇక పై ఉపాధినిచ్చే కొత్త కోర్సులే: కేంద్రం

ఏదో చదివామంటే చదివాము అని కాకుండా.. కాస్త విద్యతో పాటు ఉపాధి కూడా దొరికితే సంతోషం. అందుకే అలాంటి వాటిపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. ఇకపై ఇంజనీరింగ్ విద్యలో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉండే కోర్సులను అనుమతించబోమని అఖిల భారత సాంకేతిక విద్యామండలి తెలిపింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కృత్రిమ మేధ (ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్), బ్లాక్‌చైన్, ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ డేటా సైన్సెస్, సైబర్ సెక్యూరిటీ, త్రీడీ ప్రింటింగ్, డిజైన్ వంటి విభాగాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ లోక్‌సభలో వెల్లడించారు. ఇంజనీరింగ్ విద్యార్థులను మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేలా చూస్తామని పోఖ్రియాల్ అన్నారు. దేశంలోని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా..ఇంజనీరింగ్ విద్యార్థులను తయారు చేసేందుకు వీలుగా ఏఐసీటీఈ పలు చర్యలు తీసుకుంటోందని అందులో భాగంగానే విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ కూడా తప్పనిసరి చేస్తున్నామని ఆయన అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story