తాజా వార్తలు

50 శునకాలకు విషం ఇచ్చి చంపిన గ్రామ సర్పంచ్‌

50 శునకాలకు విషం ఇచ్చి చంపిన గ్రామ సర్పంచ్‌
X

నల్గొండ జిల్లాలో శునకాలకు విషం ఇచ్చి చంపిన ఘటన వివాదాస్పందగా మారింది. గ్రామ సర్పంచే దాదాపు 50 శునకాలకు విషం ఇచ్చి చంపడంపై బ్లూ క్రాస్ ఆఫ్‌ హైద్రాబాద్‌ అనే స్వచ్చంద సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. మూగ జీవుల పట్ల అంత దారుణంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై వెంటనే స్పందించిన కలెక్టర్ ఘటనపై చర్యలకు ఉపక్రమించారు. ఘటనపై పూర్తి విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు కలెక్టర్.

నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలోని తెల్థేవర్‌పల్లిలో కుక్కల బెదడను తట్టుకోలేక గ్రామ సర్పంచ్‌ పాపనాయక్‌ వాటికి విషం పెట్టి చంపేశాడు. గ్రామంలోని దాదాపు 50 కుక్కలకు విషం పెట్టి చంపేసి.. వాటిని నక్కలగండి ప్రాజెక్టలో గోతులు తీసి పాతిపెట్టారు. గత బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం జంతుసంరక్షణ స్వచ్చంద సంస్థ బ్లూక్రాస్‌ ఆఫ్‌ హైద్రాబాద్‌కి తెలియడంతో దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లూ క్రాస్‌ వ్యవస్థాపకురాలు, సినీ నటి అక్కినేని అమల నల్గొండ జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఘనటపై యాక్షన్ తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. వెంటనే పూర్తి విచారణ జరిపించాలని జిల్లా పంచాయతీరాయ్‌ అధికారి యాదవ్‌ని ఆదేశించారు. బాధ్యులైన వారిపై కేసులు పెట్టి.. చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.

Next Story

RELATED STORIES