Top

రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. కత్తులతో బెదిరించి..

రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. కత్తులతో బెదిరించి..
X

కర్నూల్‌ జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పార్థసారథి నగర్‌లో అర్ధరాత్రి రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు దుండగులు. కుటుంబ సభ్యులను కత్తులతో బెదిరించి మరీ నగదు, నగలను చోరీ చేశారు. మోహన్‌ కృష్ణ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి దంపతులను కత్తులతో బెదిరించారు. ఇంట్లో నుంచి 10తులాల బంగారు అభరణాలు దోచుకెళ్లారు. అదే కాలనీలో మరో ఇంట్లో కూడా చోరీకి పాల్పడ్డ దొంగలు.. 3తులాల నగదు, 40వేల నగదును అపహరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story

RELATED STORIES