Top

తెలుగు రాష్ట్రాల్లో గురు పౌర్ణమి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో గురు పౌర్ణమి వేడుకలు
X

తెలుగు రాష్ట్రాల్లో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ శుద్ధ పౌర్ణమికి ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సద్గురు సాయిబాబా ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. సాయినామ స్మరణతో మార్మోగుతున్నాయి. సాయి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు.

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి పర్వదిన వేడుకలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. విద్యుత్‌దీప కాంతులతో సాయి ఆలయం దేదీప్యమానంగా కాంతులీనుతోంది. బాబా ఆలయానికి చేరుకుంటున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. అటు ఎల్‌బీనగర్, పంజాగుట్ట, కూకట్‌పల్లి సాయిబాబా ఆలయాల్లో గురుపూర్ణిమ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సాయిని దర్శించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు.

Next Story

RELATED STORIES