చీకటి పడుతోందంటే వణికిపోతున్న హాస్టల్ విద్యార్థినులు

చీకటి పడుతోందంటే వణికిపోతున్న హాస్టల్ విద్యార్థినులు

చీకటి పడుతోందంటే ఆ హాస్టల్‌ విద్యార్థినులు వణికిపోయారు. ఈ రాత్రి ఎలా గడుస్తుందిరా దేవుడా అంటూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రతీరాత్రి ఇదే టెన్షన్. ఇక ఆ టార్చర్‌ భరించలేమంటూ పేరెంట్స్‌ను పిలిపించుకుని ఇళ్లకు వెళ్లిపోయారు.

కర్నూలు జిల్లా సి.బెలగల్‌ ప్రభుత్వ ఆదర్శ బాలికల పాఠశాలలో 75 మంది విద్యార్థినులు చదువుతున్నారు. వేసవి సెలవుల తర్వాత అందరూ హ్యాపీగా హాస్టల్‌కు తిరిగి వచ్చారు. నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి హాస్టల్లోని పిల్లలంతా భయంతో గజగజా వణికిపోయారు. రాత్రంతా నిద్రలేకుండా హాస్టల్ గదిల్లోనే గడిపారు. ఎందుకంటే రకరకాల అరుపులు, పిల్లలు ఏడుస్తున్న సౌండ్లు వణికించాయి. తెల్లారిన వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిందంతా మొరపెట్టుకున్నారు.

పిల్లల భయంతో వెంటనే తల్లిదండ్రులంతా హాస్టల్లో వాలిపోయారు. ప్రిన్సిపాల్ పవన్ కిశోర్, హాస్టల్ వార్డెన్ వరలక్ష్మితో గొడవకు దిగారు. దెయ్యాలు తిరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారని నిలదీశారు. పిల్లలు రెండు రోజులుగా భయపడుతుంటే మాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని వాదనకు దిగారు. పిల్లలను ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఒక్కసారిగా హాస్టల్ మొత్తం ఖాళీ అయిపోయింది.

కొత్తగా చేరిన 9వ తరగతి విద్యార్థిని హాస్టల్లో ఉండలేకపోయింది. ఇంటికి వెళ్లేందుకు ఆమె దెయ్యం స్టోరీ క్రియేట్ చేసిందంటున్నారు అధికారులు. ఈ నెల 12న తొలిఏకాదశి, 13న రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం. వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. కానీ పిల్లల్ని ఇంటికి పంపించలేదు. దీంతో దెయ్యాల స్టోరీ క్రియేట్ చేసిందని తేలింది. ఈ ఆదర్శ పాఠశాల ఊరి శివారులో ఉంది. పైగా కొండ ప్రాంతం. రాత్రిపూట గాలి కాస్త ఎక్కువగా వీస్తుంది. పిచ్చుకలు, కుక్కల అరుపులు వినిపిస్తుంటాయి. దెయ్యం స్టోరీ క్రియేట్ చేయడంతో.. రోజూ వీచే గాలే వారికి దెయ్యం అయింది. పిచ్చుకలు, కుక్కల అరుపులే వింత శబ్ధాలుగా వినిపించాయి.

Tags

Read MoreRead Less
Next Story