‘బిగ్ బాస్’ బూతు షో.. ఆ సమయంలోనే ప్రసారం చేయాలి : హైకోర్టులో పిల్

‘బిగ్ బాస్’ బూతు షో.. ఆ సమయంలోనే ప్రసారం చేయాలి : హైకోర్టులో పిల్
X

మోస్ట్ పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ ను రోజుకో వివాదం వెంటాడుతోంది. బిగ్ బాస్ త్రీ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. అయితే..బిగ్ బాస్ బూతు షో అంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. రియాలిటీ షో ముసుగులో అశ్లీలత ఎక్కువగా చూపిస్తున్నారన్నది పిటీషనర్ వాదన. బిగ్ బాస్ త్రీలో ప్రసారం అయ్యే ప్రతీ ఎపిసోడ్ సినిమా తరహాలోనే సెన్సార్ చేయాలని కోరారు. ఇక షో ప్రసారం చేసే సమయంపైనా పిటీషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అశ్లీలత ఎక్కువగా ఉంటుంన్నందున రాత్రి పదకొండు గంటల తర్వాతే ప్రసారం చేయాలన్నారు. బిగ్ బాస్ త్రీ హోస్ట్ నాగార్జునతో పాటు 10 మందిని ప్రతివాదులుగా చేర్చారు పిటీషనర్.

గతంలో బిగ్ బాస్ షో ప్రారంభం అయ్యాక వివాదాలు ప్రారంభం అయ్యేవి. కానీ, బిగ్ బాస్ త్రీకి మాత్రం హౌజ్ మేట్స్ ఎంపిక దశలోనే కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారింది. బిగ్ బాస్ కు సెలక్ట్ చేయాలంటే కమిట్ మెంట్ అడుగుతున్నారంటూ కో-ఆర్డినేటర్లు, ప్రొడ్యూసర్లపై ఆరోపణలు వచ్చాయి. గతంలో న్యూస్ రీడర్, జర్నలిస్ట్ అయిన శ్వేతారెడ్డితో పాటు గాయిత్రి గుప్త ఏకంగా పోలీసులు ఫిర్యాదు చేశారు. కో-ఆర్డినేటర్ రవికాంత్ తనను కమిట్ మెంట్ అడుగుతున్నట్లు శ్వేతారెడ్డి తొలిసారి బిగ్ బాస్ త్రీ సెలక్షన్స్ పై ఆరోపణలు చేశారు. బిగ్‌ బాస్‌ నిర్వాహాకులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రోగ్రాం ఇన్‌ఛార్జ్‌లు శ్యామ్‌, రఘుపై జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శ్వేతారెడ్డి తర్వాత గాయత్రిగుప్తా కూడా బిగ్ బాస్ సెలక్షన్స్ ఫై ఫైర్ అయ్యారు. తాను బిగ్ బాస్ 3కి సెలక్ట్ చేస్తున్నట్లు అభిషేక్‌, రఘు, రవికాంత్‌ తమ ఇంటికి వచ్చి అగ్రిమెంట్‌ కూడా చేసుకున్నారని ఆరోపించారామె. దీంతో తాను ఆరు సినిమాలను వదులుకొని మరీ హౌజ్ లో ఎంట్రీకి సిద్ధమయ్యానని అన్నారు. తీరా షో ప్రారంభం అయ్యేందుకు కొద్ది రోజుల ముందు తానను సెలక్ట్ చేయకుండా మోసం చేశారని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారామె. అసభ్యకరమైన రీతిలో కమిట్‌మెంట్‌ అడిగారని గాయత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

వరుస వివాదాలు ఫిర్యాదులు, కోర్టు కేసులతో బిగ్ బాస్ టీంలో ఆందోళన నెలకొంది. షో ప్రారంభం అయ్యే సమయంలో అవాంతరాలను దాటే ప్రయత్నాల్లో ఉంది బిగ్ బాస్ కో ఆర్డినేషన్ టీం. తమపై బంజారాహిల్స్, రాయదుర్గం పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటీషన్లు దాఖలు చేసింది.

Next Story

RELATED STORIES