చెన్నై రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్ధినులు దుర్మరణం

చెన్నై రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్ధినులు దుర్మరణం
X

తమిళనాడు చెన్నై నగరానికి చెందిన నందనంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థినులు దుర్మరణం పాలయ్యారు. రాజమండ్రికి చెదిన భవానీ, నాగలక్ష్మి, శివ ఇంజనీరింగ్ చదువుతున్నారు. మంగళవారం ముగ్గురూ కలిసి ఒకే బైక్‌పై తాంబారంలోని కాలేజీకి వెళుతున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన బైక్ బలంగా ఢీకొట్టింది. బైక్‌తో సహా ముగ్గురూ బస్సు కిందపడిపోయారు. బస్సు చక్రాల పడి భవానీ, నాగలక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా శివకు తీవ్రగాయాలయ్యాయి. వీరి బైక్‌ను ఢీకొట్టిన వ్యక్తి కూడా గాయాలపాలయ్యాడు. ఇద్దరినీ తాంబారం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శివ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Next Story

RELATED STORIES