అందుకే నగ్నంగా నటించాను

అందుకే నగ్నంగా నటించాను
X

అమలా పాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తెలుగులో నటించిన ఇద్దరమ్మాయిలు’, ‘నాయక్‌’ చిత్రాలతో ఆకట్టుకున్న అమలా ఇప్పుడు ‘ఆమె’ చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఆమె మీడియాతో ముచ్చటించారు. తెలుగు చిత్రసీమ నాకు రెండో ఇల్లు. ఇక్కడ మరిన్ని సినిమాలు చేయాలనుంది అన్నారు. ఓ సన్నివేశంలో నగ్నంగా నటించారు కదా? అంత ధైర్యం ఎందుకు చేశారు? అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ '"ఆ సన్నివేశాన్ని కథ డిమాండ్ చేసింది. కావాలని పెట్టింది కాదు. ముందుగా స్క్రిప్ట్‌లో ఉన్నఆ సన్నివేశాన్ని చూసి నేను షాక్‌ తిన్నాను. వెంటనే దర్శకుణ్ని పిలిచి మాట్లాడాను. అది ఎంత అవసరమో తను వివరించాడు.నటిగా నాకు కూడా అది సవాల్‌గానే అనిపించింది. అందుకే నగ్నంగా నటించే ధైర్యం చేయగలిగానన్నారు" థ్రిల్లర్‌ చిత్రంగా రూపొందించిన ‘ఆమె’ను దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెల 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story

RELATED STORIES