Top

ఆ పేరుతో తెలంగాణకు కరెంట్ ఇవ్వాలని చూస్తున్నారు : చంద్రబాబు

సీఎం జగన్ కు తెలంగాణపై ఉన్న ప్రేమ ఏపీ మీద లేదని ఆరోపించారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. పీపీఏలకు సంబంధించి గత ప్రభుత్వంపై జగన్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారాయన. పీపీఏలపై సమీక్ష పేరుతో తెలంగాణకు కరెంట్ ఇవ్వాలని చూస్తున్నారని అన్నారు. వైసీపీ చెప్పిన రేట్లకు టీడీపీ ప్రభుత్వం ఎక్కడా విద్యుత్ కొనుగోలు చేయలేదని ఆరోపణలను కొట్టిపారేశారు. పీపీఏల విషయంలో ప్రభుత్వ పాత్ర నామమాత్రం అని గుర్తు చేశారు.

పీపీఏలపై విమర్శలు చేస్తున్న జగన్..తమ పవర్ ప్లాంట్ నుంచి కర్ణాటకకు ఎందుకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ప్రశ్నించారు చంద్రబాబు. రెండు పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ ఎక్కువ ధరకు అమ్ముకుంటూ ఏపీలో మాత్రం యూనిట్ ధరలపై గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు.

Next Story

RELATED STORIES