అసలుసిసలైన యాప్ ను అందుబాటులోకి తేనున్న ఫేస్‌బుక్‌!

అసలుసిసలైన యాప్ ను అందుబాటులోకి తేనున్న ఫేస్‌బుక్‌!

టిక్‌టాక్‌ ఎంత ఫేమస్‌ అయ్యిందో మనం చూస్తున్నాం. తమలోని ప్రతిభను చాటుకోవడానికి టిక్‌ టాక్‌ ఓ ఆయుధంలా మారింది నేటి యువతకు. ప్రపంచ వ్యాప్తంగా పాపులార్‌ అయిన టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఫేస్‌బుక్‌ యాప్‌ రానుంది.

ప్రపంచంలో ఎక్కువ మంది యూజర్లతో ఒకప్పుడు ఫేస్ బుక్కే మొదటి స్థానంలో ఉండేది. ఆ తర్వాత వాట్సాప్ వచ్చి ఫేస్ బుక్ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. దాంతో వాట్సాప్‌ని కొనేసింది ఫేస్ బుక్. ఇప్పుడు టిక్ టాక్ వచ్చి అటు ఫేస్ బుక్, ఇటు వాట్సాప్ రెండింటికీ గట్టి పోటీ ఇస్తోంది. ఈ క్రమంలో ప్రజలు ఫేస్ బుక్‌ని దాదాపు మర్చిపోతున్నారు. వాట్సాప్ కూడా ఎప్పుడో ఓసారి అలా చూసి ఇలా క్లోజ్ చేస్తున్నారు. ఈ పోటీని తట్టుకోవాలంటే టిక్ టాక్ లాంటిదే ఓ యాప్ తేవాలని ఫేస్ ‌బుక్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకించి న్యూ ప్రొడక్ట్ ఎక్స్‌పెరిమెంటేషన్ టీంని ఏర్పాటు చేసింది.

ఒకప్పుడు గూగుల్, తర్వతా ట్విట్టర్ వీడియో విభాగంలో పనిచేసిన టాఫ్ఫ్... ఇప్పుడు ఫేస్‌ బుక్‌లో చేరారు. ఆయనే సరికొత్త యాప్స్ తెచ్చే పనిలో ఉన్నారట. ఇందుకోసం UX డిజైనర్లను, ఇంజినీర్లను రిక్రూట్ చేసుకుంటున్నారు. దీన్ని బట్టీ చూస్తే ఫేస్‌బుక్‌...టిక్ టాక్ లాంటి యాప్స్ తేబోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story