అమ్మానాన్నల గొడవ.. భరించలేకపోతున్నానంటూ రాష్ట్రపతికి బాలుడు లేఖ

అమ్మానాన్నల గొడవ.. భరించలేకపోతున్నానంటూ రాష్ట్రపతికి బాలుడు లేఖ

అమ్మంటే ప్రేమ.. నాన్నంటే ఇష్టం. కానీ వాళ్లిద్దరి దగ్గర కాకుండా అమ్మమ్మా తాతయ్య దగ్గర పెరుగుతున్నాడు జార్ఖండ్‌కి చెందిన ఓ అబ్బాయి. నాన్న ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ ఒక ఊర్లో ఉంటే.. అమ్మ బ్యాంకు ఉద్యోగం చేస్తూ పాట్నాలో ఉంది. వారానికి ఒకసారి కలుసుకున్నా ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండరు. ఏదో ఒక గొడవతో ఇంటిని నరకంలా మార్చేస్తున్నారు. దీంతో నాకు పిచ్చెక్కిపోతుంది. వాళ్లిద్దరి గొడవ భరించలేకపోతున్నాను. అందుకే చచ్చిపోవాలనుకుంటున్నాను. రాష్ట్రపతి గారు నా ఆత్మహత్యకు అనుమతించండి అని ఏకంగా ప్రెసిడెంటుకి లేఖ రాశాడు. లెటర్ అందుకున్న రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు దాన్ని పీఎంవో దృష్టికి తీసుకువెళ్లాయి.

వారు భాగల్‌పూర్ అధికారులకు సమాచారం అందించి విచారణకు ఆదేశించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తండ్రిని తల్లి నిత్యం వేధిస్తుంటుందని బాలుడు అధికారులకు వివరించాడు. తాత రిటైర్మెంట్ తరువాత తండ్రితో పాటు కలిసి ఉంటున్నానని, ఇక్కడే ఉండి చదువుకుంటున్నానని తెలిపాడు. బాలుడి తాతయ్య మాట్లాడుతూ.. కొడుకు కోడలు ఇద్దరూ ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నారని.. వివాహేతర సంబంధాలున్నాయనే అనుమానంతో సంసారాన్ని పాడుచేసుకుంటున్నారని తెలిపారు. వివరాలన్నీ సేకరించిన భాగల్పూర్ అధికారులు సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story