అంతర్జాతీయ కోర్టులో పాకిస్థాన్ కు ఎదురుదెబ్బ.. భారత్ విజయం..

అంతర్జాతీయ న్యాయస్ధానం(ఐసీజే)లో మరోసారి పాకిస్థాన్ కు ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ జైల్లో బందీగా ఉన్న కుల్‌భూషణ్ జాదవ్ కు భారీ ఊరట లభించింది. కుల్‌భూషణ్ జాదవ్‌కు విధించిన మరణ శిక్షను నిలిపివేయాలని ఐసీజే బుధవారం తీర్పు వెలువరించింది. ఆయనకు నిఘా విభాగంతో సంబంధం లేదని భారత్ వాదించింది. భారత్ వాదనను సమర్ధించిన అంతర్జాతీయ న్యాయస్థానం ఆయనకు వింధించిన మరణశిక్షను నిలిపివేయాలని పాక్ కోర్టును ఆదేశించింది. కాగా గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ పాక్ సైనిక కోర్టు కుల్‌భూషణ్ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ కేసులో 2016 మార్చిలో కుల్‌భూషణ్‌ను పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. 2017 ఏప్రిల్‌లో జాదవ్‌కు పాక్ సైనిక కోర్టు మరణ శిక్ష విధించింది. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన భారత్ తమ వాదనను వినిపించింది. దీంతో కుల్‌భూషణ్ కు అనుకూలంగా తీర్పు వెలువడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com