అప్పు తీసుకున్నవారు మోసం చేశారని సెల్ఫీ వీడియో తీసి..

నమ్మి డబ్బులు ఇవ్వడమే అతని ప్రాణాల మీదకు తెచ్చింది. అప్పు తీసుకున్నవారు తిరిగి చెల్లించక మోసం చేయడంతో మనస్థాపానికి గురయ్యాడు ఓ వ్యక్తి. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్పీ వీడియో పోస్ట్ చేశాడు. తనకు ఇవ్వాల్సిన చాలా మంది అప్పు తీర్చడం లేదని.. దీంతో తాను బాకీపడిన వారికి డబ్బులు తిరిగి చెల్లించలేక పోతున్నానంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు.
ఖమ్మం జిల్లాకు చెందిన రాయపాటి నర్సింహారావు తోటివారిని నమ్మి.. లక్షల్లో అప్పు ఇచ్చాడు. ఇప్పుడు తన అవసరానికి వారు తిరిగి చెల్లించకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. దీంతో.. తాను తెచ్చిన అప్పును తీర్చలేకపోతున్నానని.. అందుకే చనిపోతున్నానని వీడియోలో తెలిపాడు. తనకు ఎవరెవరు ఎంతడబ్బు ఇవ్వాలి.. తాను ఎవరెవరికి బాకీ పడ్డానో వివరిస్తు లేఖ కూడా రాశాడు. తన సన్నిహితులకు పోస్ట్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన సన్నిహితులు ఇంటికి వెళ్లి చూడగా ఐదు రోజులుగా కుటుంబసభ్యులు ఎవరూ ఉండడంలేరని స్థానికులు తెలిపారు. దీంతో ఆందోళన ఇంకాస్త ఎక్కువైంది. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇప్పుడీ వీడియో ఖమ్మం జిల్లాలో వైరల్‌గా మారింది. నర్సింహారావు జాడ కనిపించకపోవడంతో అఘాయిత్యానికి పాల్పడ్డాడా అని ఆందోళన చెందుతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com