పెళ్లికాని అమ్మాయిలు ఫోన్‌ వాడితే తల్లిదండ్రులకు శిక్ష

పెళ్లికాని అమ్మాయిలు ఫోన్‌ వాడితే తల్లిదండ్రులకు శిక్ష

దేశం రాకెట్ సైన్స్‌లో దూసుకుపోతుంటే కొన్ని ప్రాంతాలలో పెద్దల అనాగరిక ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గుజరాత్‌‌కు చెందిన ఠాకూర్ వర్గం పెద్దలు తీసుకున్న నిర్ణయాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అమ్మాయిలపై ఆంక్షలు విధిస్తూ తీసుకున్న నిర్ణయాలపై స్త్రీవాదులు భగ్గుమంటున్నారు. ఠాకూర్ నాయకులు జూలై 14 న 12 గ్రామాల ప్రతినిధులు, యువకులతో దాదాపు 800 మంది ఠాకూర్ నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తొమ్మిది పాయింట్లతో తీర్మానాన్ని ఆమోదించారు. వాటిలోని అంశాలు ..పెళ్లికాని అమ్మాయిలు మొబైల్ ఫోన్‌లు వాడకూడదు. వాడినట్లైతే తల్లిదండ్రులే బాధ్యత వహించి శిక్ష అనుభవించాల్పి ఉంటుంది. కులాంతర వివాహాల్ని చేసుకోకూడదు. కులాంతర వివాహాలు చేసుకున్నట్లైతే జరిమాన చెల్లించాల్సి ఉంటుంది.

ఠాకూర్ అమ్మాయి మరో వర్గానికి చెందిన అబ్బాయిని వివాహం చేసుకుంటే ఆ కుటుంబం​ రూ.1.5 లక్షల జరిమానా చెల్లించాలి. అదే ఠాకూర్ కుర్రాడు వేరే కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు జరిమానా చెల్లించాల్సి వుంటుంది.ఇలా తొమ్మిది పాయింట్ల తీర్మానాన్ని రూపొందించారు. దీనికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఆదేశించారు. వీరి నిర్ణయాలలో ఆమోదయోగ్యమైనవి కూడా ఉన్నాయి. అవి..కట్నం తీసుకోకూడదని, వివాహ ఊరెగింపులలో బాణాసంచా కాల్చకూడదని, ఇంట్లో అన్నదమ్ములు ఘర్షణ పడితే వారిని కుటుంబం నుంచి వెలివేయాలని , పెళ్లి కొడుకును గుర్రంపై ఊరేగించడాన్ని నిషేధిస్తూ తీర్మానించారు.

Tags

Read MoreRead Less
Next Story