మద్యం ఆపై గన్స్‌తో డ్యాన్స్ : ఎమ్మెల్యేపై వేటు

ఒక చేతిలో గన్, మరో చేతిలో మందు గ్లాసు పట్టుకొని చిందులు వేసిన ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ పై వేటు పడింది. ఏకంగా 6ఏళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించారు. ప్రణవ్ చిందులేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న బీజేపీ ప్రణవ్ సింగ్ ను పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది...
ప్రణవ్ సింగ్ కు వివాదాలు కొత్త కాదు. ఎప్పుడూ ఏదో వివాదంతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.. ఇటీవల ఆయన తన మద్దతుదారులతో కలిసికలిసి డ్యాన్స్ చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. చేతుల్లో గన్స్ పట్టుకుని బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేశారు. మధ్య మధ్యలో మందు తాగుతూ.. తుపాకులను నోట్లో పెట్టుకుని రచ్చ చేశాడు. కాలు ఆపరేషన్ తర్వాత కోలుకున్న ప్రణవ్ సింగ్ తన మద్ధతుదారులను కలిసిన సందర్భంగా ఈ గన్ డ్యాన్సులతో హంగామా సృష్టించాడు. అక్కడితో ఆగకుండా ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ మందు బాబులతో చిందులేశారు. గతంలోనే క్రమశిక్షణ ఉల్లంఘన, అసభ్య ప్రవర్తన కారణంగా అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. ఇప్పుడీ ఘటనతో ఏకంగా 6 ఏళ్ల పాటు బహిష్కరణ విధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com