అమరావతి రాజధాని విషయంలో సంచలన నిర్ణయం ప్రకటించిన ప్రపంచబ్యాంక్

X
TV5 Telugu18 July 2019 4:26 PM GMT
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం డోలాయమానంలో పడిందా? అమరావతి కేపిటల్ సిటీ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రపంచబ్యాంక్ ప్రకటించింది. CRDA అధికారులు మాత్రం తమకు ఎలాంటి సమాచారం అందలేదని అంటున్నారు. వరల్డ్‌బ్యాంక్ మాత్రం ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ అయినట్టు తన వెబ్‌సైట్‌లో పెట్టింది.
2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు రాజధాని నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అమరావతి సస్టెయినబుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును చేపట్టారాయన. అందుకు.. 300 మిలియన్ డాలర్లు అంటే.. సుమారు 2 వేల 100 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు ప్రపంచబ్యాంక్ ముందుకొచ్చింది. అయితే.. మారిన పరిస్థితుల నేపథ్యంలో... ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు నిర్ణయం తీసుకుంది.
Next Story