ప్రాణాలు పోతున్నా 30 మంది ప్రయాణికులను కాపాడిన డ్రైవర్

అతని ప్రాణాలు పోతున్నా..బస్సులోని ప్రయాణికుల రక్షించి కన్నుమూశాడు బస్సు డ్రైవర్. విధి నిర్వహణలో ఉండగా గుండెపోటు రావటంతో వెంటనే బస్సును పక్కకు ఆపి స్టీరింగ్ పై పడి మృతిచెందాడు డ్రైవర్ నారాయణప్ప. కర్ణాటకలోని కేజీఎఫ్ నుంచి కుప్పం బస్సు సర్వీసు గురువారం మధ్యాహ్నం 30 మంది ప్రయాణికులతో బయల్దేరింది. మార్గమధ్యలో డ్రైవర్ నారాయణప్పకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దీంతో వెంటనే అతని దగ్గరున్న టాబ్లెట్ వేసుకున్న డ్రైవర్..స్టీరింగ్ మీదే కుప్పకూలిపోయాడు.
ఆఖరి క్షణాల్లోనూ తమ ప్రాణాల రక్షించేందుకు తాపత్రయపడిన డ్రైవర్ నారాయణప్పను బస్సులోని ప్రయాణికులు ప్రశంసించారు. డ్రైవర్ బస్సును ఆపకుంటే పెను ప్రమాదం జరిగేదన్నారు. విధి నిర్వహణలో ఎంతో అప్రమత్తంగా ఉండే నారాయణప్ప మృతి పట్ల తోటి సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com