ఆలయంలో తొక్కిసలాట.. ఐదుగురు మృతి

ఆలయంలో తొక్కిసలాట.. ఐదుగురు మృతి
X

తమిళనాడులోని కాంచీపురం అత్తివరదరాజస్వామి ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆలయంలో తొక్కిసలాట జరగడంతో ఐదుగురు మృతిచెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు... వీరిని కంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..మృతుల్లో గుంటూరు జిల్లాకు చెందిన నారాయణమ్మ అనే మహిళతోపాటు, తమిళనాడుకు చెందిన భక్తులు ఉన్నారు.

గురువారం స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం కావడంతో దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడి పెరగడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. అటు ఈ ఘటనలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. స్వామివారు 48 రోజులపాటు దర్శనం ఇస్తారు కాబట్టి.. గర్భిణులు, వృద్ధులు ఆలయానికి ఇప్పుడే రావద్దని సూచించింది.

Next Story

RELATED STORIES