సభలో విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం కుమారస్వామి

కర్నాటకలో విశ్వాస పరీక్షపై చర్చ కొనసాగుతోంది. సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం కుమారస్వామి.. చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ తీరును ఎండగట్టారు కుమారస్వామి. ప్రభుత్వం అధికారాన్ని లాక్కోవడానికి ఎన్నో కుట్రలు జరిగాయని ఆరోపించారు. రెబల్ ఎమ్మెల్యేలకు బీజేపీ సహకారం ఉందని ఆయన అన్నారు. ఏడాది కాలంలో తమ సంకీర్ణ ప్రభుత్వం ఎన్నో సవాళ్లు ఎదుర్కొందన్న కుమారస్వామి.. రాష్ట్రానికి మంచి చేసేందుకు ప్రయత్నించానని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం తమ బాధ్యత అన్నారు ముఖ్యమంత్రి కుమారస్వామి.
పార్టీ ఫిరాయింపులపై ఘాటుగా స్పందించారు మాజీ సీఎం సిద్ధరామయ్య. పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగానికి ప్రమాదకరమన్నారు. బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య ప్రసంగిస్తుండగానే బీజేపీ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కాసేపు అసెంబ్లీలో హైడ్రామా నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com