'ఆమె'ని చూస్తే చెడిపోతారు.. మంత్రి

ఆమెని చూస్తే చెడిపోతారు.. మంత్రి
X

అమలాపాల్ ఓ వివాదాస్పద నటి. ఇప్పుడు 'ఆమె'‌తో మరింత వివాదాలు కొని తెచ్చుకుంటోంది. ఆ సినిమాతో ఏం సందేశం ఇవ్వబోతుందో కాని.. విడుదలకు ముందే ఎన్నో చీత్కారాలు, మరెన్నో విమర్శలు. జులై 19న ఆమె విడుదల కానున్న సందర్భంలో తమిళనాడుకు చెందిన మంత్రి ప్రియా రాజేశ్వరి సినిమాపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ సినిమా చూస్తే యువత చెడిపోతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళంలో అడాయ్ పేరుతో రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని చూడొద్దని యువతకు పిలుపునిస్తున్నారు. 'ఆమె' విడుదల నేపథ్యంలో ప్రియ మీడియాతో మాట్లాడారు. పుదుచ్చేరి నుంచి వచ్చిన అమలకు తమిళ ప్రజలపై కానీ, సంస్కృతీ సంప్రదాయాలపై కానీ ఎలాంటి గౌరవం, ప్రేమ లేదని అన్నారు. ఆమె చిత్ర పరిశ్రమకు కేవలం డబ్బు కోసమే వచ్చారని అన్నారు. చిత్రంలోని కొన్ని సన్నివేశాలు యువతపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయని అన్నారు. సెన్సార్ A సర్టిఫికెట్ ఇచ్చింది కాబట్టి కనీసం పోస్టర్లలో అలాంటి సన్నివేశాలున్నవి లేకుండా చూడాలని ప్రియ పోలీసుల్ని కోరారు. అమలాపాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Next Story

RELATED STORIES