నీళ్ల కోసం గర్భిణీని కాల్చి చంపారు

నీళ్ల కోసం  గర్భిణీని  కాల్చి చంపారు
X

నీటి కోసం యుద్దాలు జరుగుతున్నాయి. ముంచుకొస్తున్న కరువు.. నీటి కొరత ప్రజల్లో అశాంతిని రేపుతుంది. తాజాగా యుపీలో నీళ్ళ కోసం జరిగిన ఘర్షణలో ఓ గర్భిణీని కాల్చి చంపారు కొందరు. ఈటా జిల్లా సమౌర్ గ్రామంలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది.

నీటి కోసం జరిగిన వాగ్వాదంలో కొంత మంది వ్యక్తులు గర్భిణీ అన్న విచక్షణను మరిచి ఆమెపై కాల్పులు జరిపారు. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే కుప్పకూలింది. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు. గతంలో కూడా వారు నీటి కోసం గ్రామంలో దౌర్జన్యాలకు పాల్పడేవారని గ్రామపెద్ద భాను ప్రతాప్‌ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని కొంతమంది వ్యక్తులను నిందితులుగా తేల్చారు. మృతి చెందిన మహిళను మమతగా గుర్తించారు. అనంతరం వారిలోని ప్రధాన నిందితుడైన సంతోష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Next Story

RELATED STORIES