నీరు వృథా కాకుండా వినూత్న నిర్ణయం తీసుకున్న సీఎం యోగి

నీరు వృథా కాకుండా వినూత్న నిర్ణయం తీసుకున్న సీఎం యోగి

నీటి వృథాను అరికట్టేందుకు.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో ఉద్యోగులకు నీరు అందించేటప్పుడు సగం గ్లాసు మాత్రమే ఇవ్వాలని సూచించారు. అలాగే సమావేశాల్లోనూ టేబుళ్లపై పెట్టే గ్లాసుల్లో సగం వరకే నీటిని ఉంచాలన్నారు. చాలా మంది గ్లాసు నీళ్లు తీసుకుని అందులో సగం తాగి మిగతావి వదిలేస్తున్నారని.. ఆ తర్వాత వాటిని పడేయడం వల్ల పెద్ద మొత్తంలో తాగునీరు వృథా అవుతోందని యోగీ అన్నారు. దీన్ని నివారించేందుకు గ్లాసులో సగం వరకే నీరు పోయాలన్నారు. ఒకవేళ ఎవరికైనా అవసరమైతే.. మళ్లీ పోయవచ్చు అని తెలిపారు. ఈ సీజన్‌లో వర్షాలు లేక ఉత్తరప్రదేశ్‌లో కరవు ఛాయలు ఏర్పడ్డాయి. చాలా ప్రాంతాల్లో తాగునీరు దొరకడమే కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని యోగీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Tags

Read MoreRead Less
Next Story