కర్ణాటకలో బల పరీక్ష ఆరోజే?

కర్ణాటకలో బల పరీక్ష ఆరోజే?

కర్ణాటకలో హైడ్రామా కొనసాగుతోంది. ఇవాళ కూడా కర్ణాటక అసెంబ్లీలో బల పరీక్ష జరిగే అవకాశాలు కనిపించడం లేదు. విశ్వాస పరీక్ష గండం నుంచి బయటపడడానికి ప్రభుత్వాధినేతలు కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. తాజాగా స్పీకర్ రమేష్ కుమార్‌ బల పరీక్షపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విశ్వాస పరీక్షపై చర్చ ముగిసిన తర్వాతే ఓటిం గ్ జరుగుతుందని స్పీకర్ తేల్చి చెప్పారు. ఇవాళే బల పరీక్ష నిర్వహించాలని గవర్నర్ సూచించినప్ప టికీ, అసెంబ్లీ గైడ్‌లైన్స్‌నే తాను ఫాలో అవుతానని స్పీకర్ స్పష్టం చేశారు. సీఎల్పీ నేత సిద్దరామయ్య మాత్రం కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడారు. బల పరీక్ష ఇవాళే జరుగుతుందని అనుకోవద్దని సిద్దరామయ్య తేల్చి చెప్పా రు. సోమవారం వరకు చర్చ కొనసాగుతుందని, ఆ తర్వాతే ఓటింగ్ ఉండే అవకాశముందన్నారు.

అంతకముందు, కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం చెలరేగింది. ఈ మధ్యా హ్నం ఒకటిన్నర లోపు బలం నిరూపించుకోవాలంటూ సీఎంకు గవర్నర్‌ లేఖ రాయడంతో శాసనసభలో ఉద్రిక్తత ఏర్పడింది. విశ్వాస పరీక్ష జరపా ల్సిందే అని బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. గవర్నర్‌ ఆదేశాన్ని పాటించాలని నినాదాలు చేశారు. అయినా స్పీకర్‌ చర్చను కొనసాగించారు. రెండో రోజు చర్చ ప్రారంభించిన కుమారస్వామి, బీజేపీపై నిప్పులు చెరిగారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రస్తుత పరిణామాలు రాజ్యాంగ విలువ లను ధ్వంసం చేసేలా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సీఎం సీటు మీద ఆశ లేదని.. చర్చ జరిగిన తర్వాతే తన స్థానాన్ని తీసుకోవా లని సూచించారు.

వాస్తవానికి గురువారమే బల పరీక్ష పూర్తి చేయాలని స్పీకర్‌కు గవర్నర్‌ లేఖ రాశారు. గందరగోళం కారణంగా సభను ఇవాళ్టికి వాయిదా వేయడంతో గవర్న ర్, సీఎంకు లేఖ రాశారు. బల నిరూపణకు డెడ్‌లైన్ విధించారు. ఐతే గడువు ముగిసిపోతున్నా విశ్వాస పరీక్ష నిర్వహించడంలేదంటూ స్పీకర్‌పై బీజేపీ నేతలు ఫైరయ్యారు. అయితే చర్చ కొనసాగకుండా తనను ఓటింగ్ పెట్టాలని డిమాండ్ చేసే హక్కు మీకు లేదంటూ బీజేపీ సభ్యులపై ఫైరయ్యారు స్పీకర్. క్రాస్ ఓటింగ్ కోసం తనకు బీజేపీ 5 కోట్లు ఆఫర్ చేసిందని జేడీఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ ఆరోపించారు. మరోవైపు తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story