ఐదుగురి ప్రాణాలు తీసిన ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ

ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఐదుగురి ప్రాణాలు తీసింది. 15 మందిని తీవ్ర గాయాల పాలు చేసింది. తమిళనాడులోని అత్తివరదర్ ఆలయంలో తొక్కిసలాటకు దారి తీసిన కారణాలేంటన్న దానిపై షాకింగ్ వీడియో బయటకొచ్చింది. దర్శనానికి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టుండి గొడవ పడ్డారు. క్యూలైన్‌లో ఉన్నామన్న విషయం కూడా మర్చిపోయి ఒకరిపై ఒకరు దాడికి దిగారు. పక్కనున్నవారిని తోసుకుంటూ కొట్టుకున్నారు. ఈ ఘర్షణతో చుట్టుపక్కల వారు వేగంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడం, అదే సమయంలో వెనుక నుంచి ఒక్కసారిగా ఎక్కువ మంది ముందుకు రావడంతో తోపులాట మొదలైంది. క్షణాల్లో కొందరు అదుపుతప్పి కిందపడిపోయారు. ఏమవుతుందో అర్థం కాని గందరగోళంలో అక్కడి నుంచి తప్పించుకునేందుకు అంతా ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. ఇది ఐదుగురు ప్రాణాలు బలితీసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com