తాజా వార్తలు

నటికి బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌ నిర్వాహకులు

నటికి బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌  నిర్వాహకులు
X

నటి మీరామిథున్‌కు చెన్నై హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ఆమెకు హైకోర్టు నిబంధనలతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. బెయిల్ రావడంతో బిగ్‌బాస్గేమ్‌షో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆమె తమిళ బిగ్‌బాస్-3 కంటెస్టెంట్‌గా హౌస్‌లో ఉన్నారు. కోర్టు బెయిల్ మంజూరు చేయకుంటే ఆమె షో నుంచి బయటకు వచ్చేది.. దీంతో నిర్వాహుకులకు భారీ మెుత్తంలో నష్టం జరిగేది.

నటి మీరా మిథున్‌ అందాల పోటీల నిర్వాహణ కోసం తన వద్ద రూ.50 వేలు తీసుకుందని వాటిని తనకు తిరిగి ఇవ్వలేదని రంజిత్‌ బండారి అనే వ్యక్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతని పిర్వాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేయలని నిర్ణయించారు. దీంతో మిథన్‌ ముందస్తు బెయిల్‌ కోసం చెన్నై హైకోర్టును ఆశ్రయించింది.తాను బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోలో ఉన్నానని ఇప్పుడు పోలీసుల ముందు హాజరుకాలేనని చెప్పింది. హౌస్ నుంచి బయటకు రాగానే పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని కోర్టుకు తెలిపింది. నటి మీరామిథున్‌ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు షరతులతో కూడిన ముందుస్త బెయిల్‌ను మంజూరు చేసింది.

Next Story

RELATED STORIES