పింఛను రెండు వేల రూపాయలకు పెంచి ఇస్తున్నాం : మాజీ మంత్రి కేటీఆర్

పింఛను రెండు వేల రూపాయలకు పెంచి ఇస్తున్నాం : మాజీ మంత్రి కేటీఆర్

రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వం తమదేనని అన్నారు కేటీఆర్. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి 200 రూపాయలు ఉన్న పింఛన్ ను వెయ్యి రూపాయలకు పెంచామన్న కేటీఆర్..ఇప్పుడు వెయ్యిని రెండు వేల రూపాయలకు పెంచి ఇస్తున్నామన్నారు. పింఛన్ వయస్సును 57 ఏళ్లకు తగ్గించటంతో 7 లక్షల మంది లబ్ధి పొందుతారని అన్నారు. పేదలపై పైసా భారం పడకుండా అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇళ్లను ఇచ్చి తీరుతామని అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లపై నమ్మకం లేనివారికి తానే బస్ ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణాలు చూపిస్తానని అన్నారాయన.

Tags

Read MoreRead Less
Next Story