Top

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
X

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురస్తున్నాయి. తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని జిల్లాల్లో ఓ మోస్తారు వానలు పడుతున్నాయి. నిన్న హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. ప్రస్తుతం తెలంగాణలో రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రాజన్న సిరిసిల్లా జిల్లాలో కుండపోత వర్షం కురిసింది.. వేములవాడ పట్టణంలో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రాజన్న ఆలయ పరిసరాల్లోకి కూడా వరద చేరడంతో భక్తులు, వ్యాపారులు ఇబ్బంది పడ్డారు.. అటు కోనాయిపల్లి శివారులోని గుడిసెల్లోకి కూడా వరద చేరింది..

ఇక అటు ఏపీలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని పర్చూరు, యద్దనపూడి, మార్టూరు,ఇంకొల్లు, కారంచేడు, చిన్నగంజాం మండలాలలో భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు జలకళను సంతరించుకున్నాయి. మార్కాపురం డివిజన్‌ లోని గిద్దలూరు - దోర్నాల- ఎర్రగొండ పాలెంలోనూ వర్షం పడింది.

అనంతపురం జిల్లా గుత్తిలో కుండపోత కురిసింది...లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో.. వరదనీరు పొంగిపొర్లింది. దీంతో రోడ్లు కాలువలను తలపించాయి...ఎస్సీ హాస్టల్లోకి నీరు ప్రవేశించడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు..అటు పలుకాలనీల్లో ఇళ్లల్లోకి కూడా వరద నీరు చేరింది.

Next Story

RELATED STORIES