వైసీపీ నుంచి బీజేపీలోకి నేతలు క్యూ కడుతున్నారు - రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు

వైసీపీ నుంచి బీజేపీలోకి నేతలు క్యూ కడుతున్నారు - రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు

తెలంగాణలో ఇప్పటికే దూకుడు పెంచిన బీజేపీ.. ఇప్పుడు పూర్తిగా ఏపీపై ఫోకస్‌ చేసింది. 2024 ఎన్నికల నాటికి ప్రధాన పార్టీగా బలపడడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఆపరేషన్‌ కమలాన్ని షురూ చేసిన ఆ పార్టీ.. త్వరలోనే టీడీపీ, వైసీపీలకు చెందిన కీలక నేతలు పార్టీలో చేరుతారంటూ ప్రచారం చేస్తోంది. మొన్నటి వరకు కేవలం టీడీపీనే టార్గెట్‌ చేసిన బీజేపీ నేతలు.. ఇప్పుడు వైసీపీ పాలపైనపై నిప్పులు చెరుగుతున్నారు.

ఎన్నికల ముందు వరకు వైసీపీకి కాస్త సోపర్ట్‌గా ఉన్నట్టు కనిపించిన.. బీజేపీ ఇప్పుడు వాయిస్‌ మార్చింది.. జగన్‌ సర్కారు తీరుపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జగన్‌ పాలన అవీనితిమయంగా ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ విమర్శించారు. గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలే జగన్‌ అసమర్ధపాలనకు ఉదాహరణ అన్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి బీజేపీలోకి నేతలు క్యూ కడుతున్నారని చెప్పి అధికార పార్టీని హెచ్చరించారు.

ఏపీలో కాషాయ కండువా కప్పుకునేందుకు పెద్ద సంఖ్యలో నాయకులు ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్సీ మాధవ్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే కమ్మ, కాపు సామాజిక వర్గ నాయకులతో టచ్‌లో ఉన్నామని. ఇకపైరెడ్డి సామాజిక వర్గ నేతలతో కూడా మంతనాలు జరుపుతామని చెప్పారు. ఆగస్టు నాటికి టీడీపీతో పాటు పలువురు వైసీపీ నేతలు కాషాయ కండువా కప్పుకోనున్నారని మాధవ్‌ వెల్లడించారు. ఏపీ సీఎం జగన్‌ తీరును బీజేపీ సీనియర్‌ నేత పురంధేశ్వరి తప్పు పట్టారు. గత ప్రభుత్వం చేసిన పొరపాటు జగన్ ప్రభుత్వం చేయొద్దని సూచించారు. కాకినాడలో బీజేపీ సంఘటనా పర్వ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న పురంధేశ్వరి.. ఏపీకి ప్రత్యేక హోదా రాదన్న విషయం తెలిసి కూడా జగన్‌ తప్పుదోవ పట్టించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. గోదావరి జలాల పంపకాల విషయంలో అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. ఒకే రోజు బీజేపీకి చెందిన కీలక నేతలు వైసీపీ పాలనపై విమర్శలు చేయడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. కేవలం విమర్శలు చేయడమే కాదు వైసీపీకి చెందిన నేతలు కూడా తమతో టచ్‌లో ఉన్నారని చెప్పడం చూస్తుంటే.. ఏపీలో ఆ పార్టీ ఇంకాస్త దూకుడు పెంచినట్టు కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story