తాజా వార్తలు

కావాలంటే అతడిపై చర్యలు తీసుకోండి: తెలంగాణ హోంమంత్రి

కావాలంటే  అతడిపై చర్యలు తీసుకోండి: తెలంగాణ హోంమంత్రి
X

తెలంగాణ హోం మంత్రి మహమ్మద్ అలీ మనవడు ఫర్కాన్ తన స్నేహితుడితో కలిసి చేసిన టిక్ టాక్ వీడియో వివాదం సృష్టిస్తునే ఉంది. ఈ వీడియోపై దుమారం రేగడంతో హోం మంత్రి స్పందించారు. పోలీస్ వాహనంపై టిక్ టాక్ వీడియో చేసిన తన మనవణ్ని ఆయన మందలించారు. ఈ విషయంలో ఏదైనా తప్పు ఉంటే అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని పోలీసు అధికారులకు స్పష్టం చేశారు.

తాజాగా తెలంగాణ హోం మినిస్టర్ మహమూద్ అలీ మనవడు ఏకంగా డీజీపీ కారును వాడుకుని చేసిన టిక్‌టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే. ఆ వీడియోలో ఐజీస్థాయి అధికారిని ఉద్దేశిస్తూ "నోరు అదుపులో పెట్టుకోవాలి.. లేదంటే పీక కోస్తా" అంటూ బెదిరిస్తూ చెప్పే ఓ సినిమా డైలాగ్‌ ఉంది. ఈ డైలాగ్‌పై నెటిజన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు ఇది తీవ్ర వివాదాస్పదం అవడంతో హోమంత్రి మహమ్మద్ అలీ స్పందిచారు.

Next Story

RELATED STORIES