గర్భం దాల్చిన ఎనిమిదో తరగతి విద్యార్థిని

గర్భం దాల్చిన ఎనిమిదో తరగతి విద్యార్థిని
X

అభంశుభం తెలియని పిల్లలపై కామాంధుల పైశాచికం కొనసాగుతునే ఉంది. తాజాగా ఒడిశాలోని ఓ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిపై కామ వాంఛ తీర్చుకున్నాడు ఓ మృగాడు. ఫలితంగా ఆ విద్యార్ధిని గర్భం దాల్చింది. రుతింగా ప్రాంతానికి చెందిన అమూల్య ప్రధాన్‌ ఆ బాలికపై లైంగిక దాడి చేసినట్లు గుర్తించిన పోలీసులు

అరెస్టు చేసి గురువారం న్యాయస్థానానికి తరలించారు. బెల్‌ఘర్‌ సమీప ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని బుధవారం అనారోగ్యం పాలైంది. దీంతో ఆశ్రమ పాఠశాల వాలంటర్ బాలికకు ఆరోగ్య పరీక్షలు జరిపించారు. పరీక్షల్లో బాలిక నాలుగు నెలల గర్భిణిగా తేలింది. ఈ క్రమంలో ప్రధానోపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారించిన పోలీసులకు అమూల్య ప్రధాన్‌ నిందుతుడుగా తేల్చారు.

Next Story

RELATED STORIES