'ఉత్తర' ట్రైలర్‌ లాంచ్‌

ఉత్తర ట్రైలర్‌ లాంచ్‌
X

లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన మూవీ ‘ఉత్తర’. శ్రీరామ్, కారుణ్య కత్రేన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈమూవీ కి దర్శకుడు తిరుపతి యస్ ఆర్. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, మరో అభిరుచి గల నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా జరిగింది. రోమాంటిక్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఉత్తర ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలలో ఉంది. కొత్త బ్యాక్ డ్రాప్ లు, యాసలు తెలుగు సినిమాకి కొత్త లుక్ ని తెస్తున్నాయి. ఉత్తర కి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేవి నిజాయితీగా కనిపించే పాత్రలు, సహాజత్వం నింపుకున్న కథనం. ఈ మూవీ తప్పకుండా ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ లను అందిస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.

Next Story

RELATED STORIES