తాజా వార్తలు

అందుకే జబర్దస్త్ వినోద్‌పై దాడి!

అందుకే జబర్దస్త్ వినోద్‌పై దాడి!
X

జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులకు సుపరిచుతుడైన వినోద్ అలియాస్ వినోదినిపై దాడి జరిగింది. ఇంటి ఓనర్ తనపై దాడి చేసినట్లు వినోద్‌ ఆరోపిస్తున్నాడు. ఇళ్లు కొనుగోలు వ్యవహారంలో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దాడిలో వినోద్ కంటి భాగంలో తీవ్ర గాయమైంది.

ప్రస్తుతం తాను ఉంటున్న అద్దె ఇంటిని కొనేందుకు అడ్వాన్స్ ఇచ్చాడు వినోద్‌. 70 గజాల ఇంటి కోసం ముందస్తుగా పది లక్షల రూపాయలు కూడా చెల్లించాడు. అయితే.. అడ్వాన్స్ తీసుకున్న ఓనర్.. ఇంటిని అమ్మేది లేదంటూ మాటమార్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు అడ్వాన్స్ డబ్బులు కూడా ఇవ్వనని దబాయించినట్లు వినోద్ చెబుతున్నాడు. డబ్బుల కోసం నిలదీయటంతో ఇంటి ఓనర్ తో పాటు అతని కుటుంబసభ్యులు దాడి చేసినట్లు తెలుస్తోంది.

ఇంటి ఓనర్ పురమాయించిన ఐదుగురు వ్యక్తులు తనపై దాడికి చేసినట్లు వినోద్ చెబుతున్నాడు. తనపై హత్యాయత్నం జరిగిందన్న వినోద్ ఫిర్యాదుతో ఇంటి ఓనర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.

వినోద్‌ ప్రస్తుతం కనీసం నడవలేని, కళ్లతో చూడలేని స్థితిలో ఉన్నాడని జబర్దస్త్ ఫేం శాంతి స్వరూప్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వినోద్‌కు ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్ట్‌లు ఉన్నాయన్నారు. ఇంటిని కొని సెటిల్ అవుతున్నాడని అందరం సంబరపడ్డాం కానీ.. ఇంతలోనే వినోద్‌ని హత్య చేయాలని ప్రయత్నం చేయడం బాధాకరమన్నారు.

వినోద్‌ అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. కేవలం ఆర్థిక లావాదేవీలే హత్యాయత్నానికి కారణమా.. ఇంకమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు.

Next Story

RELATED STORIES