Top

ప్రేమజంటపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి..యువతిపై..

ప్రేమజంటపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి..యువతిపై..
X

ఒంటరి జంటలే టార్గెట్‌గా అఘాయిత్యాలకు తెగబడుతున్నారు దుండగులు. ప్రకాశం జిల్లాలో జరుగుతున్న వరుస ఘటనలతో మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. ఒంగోలు, చీమకుర్తి శివారు ప్రాంతాల్లో జరిగిన దండుపాళ్యం తరహా దాడులను మరకవ ముందే.. తాజాగా కారంచేడు శివారు ప్రాంతంలో జరిగిన అమానుష ఘటన కలకలం రేపుతోంది.

ప్రకాశం జిల్లా కారంచేడు సమీపంలో చీరాల విఠల్‌నగర్‌కు చెందిన ప్రేమజంటపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. యువతిపై అత్యాచారానికి తెగబడ్డారు. నానా చిత్ర హింసలు పెట్టి వారి దగ్గర నుంచి డబ్బులు, సెల్‌ఫోన్లు లాక్కున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు ఈ దారుణం జరగ్గా.. శనివారం బాధితురాలు కారంచేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

బాధితురాలిని మూడేళ్ల క్రితం వివాహం జరగ్గా.. విబేధాల కారణంగా విడాకులు తీసుకుని దూరంగా ఉంటోంది. తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ బతుకుదెరువు కోసం ఓ షాపులో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు.. బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజీ సేకరిస్తున్నారు.

Next Story

RELATED STORIES