తాజా వార్తలు

ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు : సీఎం కేసీఆర్‌

ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు : సీఎం కేసీఆర్‌
X

చింతమడకలోని ప్రతి కుటుంబానికి 10 లక్షలు లబ్ది పొందే పథకానికి శ్రీకారం చుడతామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. చింతమడక పర్యటన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఆత్మీయ అనురాగ సభలో కేసీఆర్‌ తన మనోభావాలను పంచుకున్నారు. రైతుబంధు, రైతుబీమా సౌకర్యం కల్పించిన రోజు చాలా సంతోషపడ్డాను అన్నారు కేసీఆర్. చింతమడక చాలా మంచి ఊరు. వాస్తు కూడా అద్భుతంగా ఉందన్నారు కేసీఆర్‌. తొలి ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించామన్నారు. ఊరికి అర్జెంట్‌గా రెండు రోడ్లు కావాలి.. మూడు నెలల్లో వేయిస్తామన్నారు సీఎం కేసీఆర్.

Next Story

RELATED STORIES