కూతురిపైనే యాసిడ్‌ దాడి చేసిన తల్లి

కూతురిపైనే యాసిడ్‌ దాడి చేసిన తల్లి
X

ఇన్నాళ్లు ప్రేమోన్మాదులు, శాడిస్టులు చేసిన యాసిడ్‌ దాడుల ఘటనలే చూశాం. ఇప్పుడు ఓ తల్లి ఏకంగా తన కూతురిపైనే యాసిడ్‌ దాడి చేసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగింది. వృద్ధాప్యంలో తనను వదిలివెళ్లిపోతోందన్న కోపంతో దాడి చేసింది. చల్లమ్మ భర్త ఏడాదిన్నర క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి చల్లమ్మ తన తల్లి లక్ష్మమ్మ వద్దే ఉంటోంది. అయితే గత కొన్ని రోజుల నుంచి తల్లి, కూతుళ్ల మధ్య ఆర్థికపరమైన గొడవలు జరుగుతున్నాయి. దీంతో తల్లి నుంచి దూరంగా వెళ్లాలని చల్లమ్మ నిర్ణయించుకుంది. దీనిపై కోపోధ్రిక్తురాలైన తల్లి కూతురిపై యాసిడ్ దాడి చేసింది. చల్లమ్మ పరిస్థితి విషమంగా మారడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి లక్ష్మమ్మ పోలీసుల అదుపులో ఉంది.

Next Story

RELATED STORIES