అడవుల్లో మంటలు.. రంగంలోకి 13 విమానాలు, హెలికాప్టర్లు..

అడవుల్లో మంటలు..  రంగంలోకి 13 విమానాలు, హెలికాప్టర్లు..
X

పోర్చుగల్‌ అడవుల్లో చెలరేగిన మంటలు భయపెడుతున్నాయి. దావానంలా విస్తరిస్తున్న మంటల్ని అదుపుచేసేందుకు ఆ దేశ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. లిస్బన్‌ నగరానికి ఉత్తరంగా ఉన్న క్యాస్టెలో బ్రన్కో ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం కార్చిచ్చు రాజుకుంది. దీనిని అదుపులోకి తెచ్చే పనిలో 1,300 మందికిపైగా ఫైర్ ఫైటర్స్, 4వందల ఫైర్ ఇంజిన్లు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. అయినా ఫలితం లేకపోవడంతో 13 విమానాలు, హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు. ఇప్పటి వరకు దాదాపు 20 మంది గాయపడ్డారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2017లో ఇదే ప్రాంతంలో రాజుకున్న కార్చిచ్చుకు 100 మందికిపైగా ప్రజలు బలయ్యారు.

Tags

Next Story