వరల్డ్‌కప్‌ గెలవాలని ప్రతి భారతీయుడు కోరుకుంటే.. అతడు మాత్రం...

వరల్డ్‌కప్‌ గెలవాలని ప్రతి భారతీయుడు కోరుకుంటే.. అతడు మాత్రం...
X

క్రికెట్ వరల్డ్‌కప్‌ గెలవాలని ప్రతి భారతీయుడూ కోరుకున్నాడు. పూజలు చేశారు. మన టీమ్‌ ఆటతీరు కూడా ఓ రేంజ్‌లో కనిపించింది. లీగ్‌ దశలో టాపర్స్‌ మనమే. కానీ.. ఒకడు మాత్రం టీమిండియా ఓడిపోవాలని.. ఫైనల్ చేరకూడదని ప్రార్థించాడట. ఏసుక్రీస్తు నా మొర ఆలకించాడు.. వరం కురిపించాడు అంటూ.. ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో దేశం ఓడిపోవాలని కోరుకున్న వాడిని ఏమనాలి? అతడు భారతీయుడేనా? మరో రూపంలో వచ్చిన ఆంగ్లేయుడా? చాలామంది నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్నలివి. తాను పెట్టుకున్న కార్యక్రమం రోజునా.. క్రికెట్ వరల్డ్‌కప్‌ ఫైనల్ జరుగుతుంటే.. ఆ పాస్టర్‌ తన ప్రోగ్రామ్‌ని వాయిదా వేసుకోవచ్చు కదా.! అది అతని చేతిలోని పని. అలా కాకుండా దేశం ఓడిపోవాలని కోరుకోవడం ఏమిటి? దేశానికి వ్యతిరేకంగా, ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ప్రార్థన చేయండని వారి పవిత్ర గ్రంథంలో రాసుందా?

టీమిండియా ఓడిపోవాలని పాస్టర్ ప్రార్థిస్తే.. ఏసుక్రీస్తు ఆలకించాడా? ఇది జీసస్‌ గొప్పతనాన్ని చాటి చెప్పడమా? ఆయనపై భక్తిని, గౌరవాన్ని తగ్గించడమా? ఎందుకంటే.. ఏ ప్రార్థనాలయంలోనైనా.. సమాజం బాగుండాలని ప్రార్థన చేస్తారు. అందులో నేనూ ఉండాలని ఏ మతస్తులైనా వేడుకుంటారు. అందుకు భిన్నంగా.. ఆ పాస్టర్‌ చేసిన ప్రార్థనను ఎలా చూడాలి? అసలు అతని ధైర్యం ఏంటి? మతం ముసుగులో ఏం చేసినా చెల్లుతుందనా? అవసరమైతే మైనార్టీ కార్డును ప్రయోగించవచ్చనా? అతన్ని ఏం చెయాలి? అలాంటి నోళ్లకు సంకెళ్లు వేయలేరా? అలాంటి వాళ్లు ఎన్ని అరాచకాలకు పాల్పడినా.. పరమత సహనం, లౌకికత్వం పేరుతో దేశం భరించాల్సిందేనా?

మరో మత బోధకుడు నిత్యానంద ఏకంగా సూర్యుడిని ఆపేశాడట. ధ్వజారోహణానికి వెళ్లడం ఆలస్యమయ్యే సరికి... అప్పటివరకు బయటకు రావొద్దని సూర్యుడిని ఆదేశించానని చెప్తున్నాడు. వినడానికే విడ్డూరంగా ఉన్నా.. అసలు అలాంటి ప్రకటనలు ఎలా చేస్తారు... వాళ్ల నుంచి భక్తులు ఏం నేర్చుకోవాలి? తాము దైవాంశ సంభూతులం అని చెప్పుకునే ప్రయత్నమా? నేనే దేవుడ్ని అని చాటుకునే వ్యూహమా?

Next Story

RELATED STORIES