Top

బైక్‌పై వచ్చి సినీఫక్కీలో బాలుడుని ఎత్తుకుపోయిన దుండగులు

బైక్‌పై వచ్చి సినీఫక్కీలో బాలుడుని ఎత్తుకుపోయిన దుండగులు
X

తూర్పు గోదావ‌రి జిల్లా మండపేటలో కిడ్నాప్ కలకలం రేపింది. విజయలక్ష్మి నగర్ లో నాయనమ్మతో కలసి వాకిoగ్ చేసి ఇంటి మెట్లు ఎక్కుతుoడగా జషిత్ అనే నాలుగేళ్ల బాలుడిని గుర్తు తెలియని దుoడగుడు బైక్ పై వచ్చి ఎత్తుకు పోయారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రశాంతంగా ఉండే మండపేటలో ఈ కిడ్నాప్ సంఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లుగా చేసింది.

నిన్న సాయంత్రం స్థానిక బ్యాంకులో ఉద్యోగం నిర్వహిస్తున్న బ్యాంకు ఉద్యోగి కుమారుడిని నాయనమ్మ వాకింగ్‌కు తీసుకు వెళ్ళింది. వాకింగ్ అనంతరం ఇద్దరు కలిసి వారు నివసిస్తున్న అపార్ట్మెంట్ వద్దకు చేరుకునేసరికి.. సినీఫక్కీలో నల్ల దుస్తులు ధరించి ముఖానికి ముసుగు వేసుకున్న ఇద్దరు ఆగంతకులు మోటార్ సైకిల్ పై వచ్చారు. వెంటనే బాలుడుని తీసుకువెళ్లిపోయారు. అడ్డొచ్చిన నాయనమ్మ పై దాడి చేశారు దుండగులు.

సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు . మోటార్ సైకిల్ వేగంగా ఆలమూరు రోడ్డు వైపుకు వెళ్లడాన్ని గమనించిన పోలీసులు వాహనాన్ని వెంబడించారు. అయితే టోల్ గేట్ వద్ద లారీ అడ్డురావడంతో క్షణాల్లో వారు మాయమయ్యారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రతి చోటా జల్లెడ పట్టారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. ఎవరైనా తెలిసిన వారు కిడ్నాప్ చేసి ఉంటారని అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Next Story

RELATED STORIES